లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని ఈడీ చేస్తున్న వాదనలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘కేజీవాల్ తరచూ నేరాలు చేసేవారు కాదు. అతడిపై అనేక ఇతర కేసులు కూడా లేవు. పైగా ప్రజలు సీఎంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నాయి.
ఇవి సాధారణ పరిస్థితులు కావు. పంటకాలంలా ప్రతి 6నెలలకు ఒకసారి ఎన్నికలు జరగవు. మీ తీరును ప్రోత్సహించలేం’ అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మార్చి 21న అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.కాగా, డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే
.