ఈరోజుల్లో ఒక్క భార్యతోనే అబ్బాయిలు వేగలేకపోతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. హైలెట్ ఏంటంటే.. ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెల్లు.. కేట్, ఈవ్, మేరీ కెన్యాలో నివసిస్తున్నారు. వారు ముగ్గురు ట్రిప్లెట్స్. ముగ్గురూ చూడటానికి ఒకే రకంగా ఉంటారు. కట్టూ బొట్టూ ఒకే రకంగా ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా ఒకేలానే చేసుకున్నారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకునేవారు.. కానీ ఎవరూ ఊహించనట్లుగా ముగ్గురూ కలిసి ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఏ వారంలో అతడు ఎవరి దగ్గర ఉండాలో కూడా పక్కాగా చార్టు వేసుకుని ఫాలో అవుతారట..
అలా మొదలైంది..
కెన్యాలో స్టీవో అనే వ్యక్తిని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన కేట్ కలుసుకుంది. అతనితో మాట కలిపింది. తర్వాత స్టీవోను తన ఇద్దరు సోదరీమణులకు కూడా పరిచయం చేసింది. స్టీవోకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు నచ్చారు.. అలాగే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా స్టీవోను ఇష్టపడ్డారు. ఒకే రూపం మాత్రమే కాదు ముగ్గురిది ఒకేలాంటి వ్యక్తిత్వం కావడంతో వారితో కలిసి జీవితాన్ని పంచుకోవడం కష్టం కాదని స్టీవో అనుకున్నాడు.. ముగ్గురిని తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
లివ్ ఇన్లో ఉన్నాకే పెళ్లి..
ముగ్గురిని పెళ్లి చేసుకుని నలుగురం కలిసి ఉండాలన్న స్టీవో నిర్ణయం అంత ఈజీగా ఏం తీసుకోలేదట.. ముందుగా వారితో సహజీవనం చేశాడు. వారితో కొన్ని నెలల పాటు రిలేషన్ షిప్లో ఉన్నాడు. ముగ్గురు అక్కాచెల్లెళ్లతో గడిపాడు. వారిని పెళ్లి చేసుకుంటే ఎలా కలిసి ఉంటారో అచ్చంగా అలాగే
కొన్ని రోజులు ఉన్నారు. అలా ఉన్నన్ని రోజులు వారి మధ్య ఎలాంటి గొడవలు, బేదాభిప్రాయాలు రాలేదు. చిన్న పాటి గొడవలు లేవు. చాలా ప్రశాంతంగా, సాఫీగా సాగిపోయాయి ఆ రోజులు. ట్రిప్లెట్స్ అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోవడం, నలుగురు కలిసి ఉండటంలో ఎలాంటి సమస్య లేదని పూర్తిగా విశ్వసించిన తర్వాతే వారిని వివాహం చేసుకున్నాడు స్టీవో.
టైమ్ టేబుల్ వేసుకుని మరీ..!
ముగ్గురు సోదరీమణులు ఎలా ఉండాలో ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారం.. స్టీవో ఎప్పుడు ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నారు. ఒకేసారి ముగ్గురు భార్యలతో జీవించేందుకు తనకు ఎలాంటి సమస్య లేదని స్టీవో అంటున్నారు. ముగ్గురినీ తాను సంతోషంగా ఉంచగలనని ధీమాగా ఉన్నాడు. మేరీతో సోమవారం, కేట్ తో మంగళవారం, బుధవారం ఈవ్ తో ఉంటున్నాడు స్టీవో. మిగతా రోజుల్లో నలుగురు కలిసి మెలిసి ఉంటారట.. భలే ఉంది కదా..!