ఆ ఆడవాళ్ళు చస్తారు.. రేప్ ల గురించి కేరళ కాంగ్రెస్ చీఫ్ సంచలనం !

-

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ ఒక వివాదాస్పదమైన ప్రకటన చేసి కొత్త వివాదానికి కారణమయ్యారు. ఆయన రేప్ జరిగిన ఆడవాళ్ళ గురించి కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. “అత్యాచారం జరిగితే ఆత్మగౌరవం ఉన్న స్త్రీ చనిపోతుంది, లేక పోతే మళ్లీ లైంగిక వేధింపులకు గురికాకుండా ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి రోజూ ఆమెను ఎవరో అత్యాచారం చేస్తున్నారని ఆమె చెబుతోంది, “అని రామచంద్రన్ అన్నారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలోనే కాదు ఇంటర్నెట్ లో కూడా దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎల్డిఎఫ్ ఒక సెక్స్ వర్కర్ ను ఆమె కథలు చెప్పేందుకు తీసుకువచ్చింది. CM బ్లాక్ మెయిలింగ్ ఈసారి పనిచేయదు. ఒక మహిళపై ఒకసారి అత్యాచారం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఆమె పదే పదే అత్యాచారం జరిగింది అంటే ఎవరూ నమ్మరని ఆయన చెప్పుకొచ్చారు. కేరళ ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version