కార్యాలయం పై ఉన్న జెండాలు తీసేసాను: కేశినేని నాని

-

విజయవాడ ఎంపీ కేశినేని నాని మొన్న సోషల్ మీడియా వేదికగా ఎంపీగా రాజీనామా చేస్తానని తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళిపోతానని చెప్పారు. అలానే త్వరలోనే ఢిల్లీ గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి లోక్సభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేసేస్తాను అని చెప్పారు. ఆ మరుక్షణం టిడిపి నుండి రాజీనామా చేస్తానని ట్విట్టర్ లో నాని పోస్ట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల తో టీడీపీ నేతలు కలిశారని తిరువూరు సంబంధించి పార్టీ కార్యక్రమంలో నన్ను దూరంగా ఉండమని చెప్పినట్టు కూడా చెప్పారు. ఇప్పుడు నాకు ప్రొటోకాల్ ఇచ్చామని చెప్పుకోటానికి సీటు, బ్యానర్లు వేసుంటారు అని అంటున్నారు. అలానే, గతంలో ప్రొటోకాల్ పాటించ లేదని ఇప్పుడు చేస్తున్నారని చెప్పారు.

అలానే నేను రాజీనామా చేసేస్తున్న అన్నా ఇంకేం ఉంటుంది అని అన్నారు. టెక్నికల్ గా ఆలస్యం కానీ, నేను రాజీనామా చేస్తా అని అన్నారు నాని. నా కార్యాలయం పై ఉన్న జెండాలు తీసేసాను బోర్డులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 10 విడతలు ఇప్పటి దాకా నీటి ట్యాంకర్లు ఇచ్చాం. 158 ట్యాంకర్లు ఇచ్చాం. ఇంకా మరో వంద ట్యాంకర్లు ఇస్తాం అన్నారు. ప్రజాప్రతినిధిగా ఎక్కడికక్కడ పని చేసుకుంటూ వెళ్తా. అదే నా లక్ష్యం. చివరి శ్వాస వరకూ విజయవాడకు కాపు కాసుకుంటూ పనిచేస్తా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version