తెలంగాణ రాష్ట్ర బీసీలకు శుభవార్త అందింది… కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రక్రియ పూర్తి జరిగిందని తెలిపారు పొన్నం ప్రభాకర్.
రెండో, మూడో తేదీల్లో బీసీ కుల సర్వేకి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేస్తామని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని స్పష్టం చేశారు. ఇవాళ, రేపు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే నివేదికపై చర్చిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈనెల 5న ఉదయం తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఉండనుందన్నారు. 5న కులగణనపై కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు
సీఎం రేవంత్, క్యాబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రక్రియ పూర్తి జరిగింది: పొన్నం ప్రభాకర్
రెండో, మూడో తేదీల్లో బీసీ కుల సర్వేకి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేస్తాం
5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ముందు… pic.twitter.com/K5COitTiuA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025