కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలో మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ ‌కార్డులు పొందాలనుకునేవారు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలకు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం షరతు విధించిన విషయం తెలిసిందే.

No more digital ration cards in Telangana

ఈ నిబంధనతో అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌ కార్డు కోల్పోయారు.దీంతో ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి తమకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే,వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న 6 వేల రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version