ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. నవంబర్ 20, 2016 న 14 కోచ్ లు పట్టాలు తప్పి 152 మంది ప్రయాణీకులు మరణించిన ఘటనపై విచారణ జరగగా… కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. తీవ్రవాద అనుమానాలు ఉండటంతో… నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు. ప్రధాని మోడీ కూడా దీని వెనుక కుట్ర ఉంది అని ఆరోపించారు.
రైలు గంటకు 106 కిలోమీటర్ల వేగంతో వెళుతుండటంతో కోచ్ లో వెల్డింగ్ లో కొంత భాగం తుప్పు కారణంగా పడిపోయి, ట్రాక్ లో పడింది అని నివేదికలో వెల్లడించారు. రెండు కోచ్ లు ట్రాక్ నుండి పక్కకు తప్పుకున్నాయి అని ఆ ప్రభావం మిగిలిన కోచ్ ల మీద పడింది అని ఈ ఘటన ఉదయం 3.02 గంటల సమయంలో మూడు సెకన్లలోనే జరిగాయన్నారు.