కవిత బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది.దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.

సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్ షీట్‌లో తప్పులున్నాయని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా అడిగారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి తెలిపారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది చెప్పారు.తదుపరి విచారణను జూలై 22కి న్యాయస్థానం వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version