తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమని ఆయన అన్నారు అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని హరీష్ రావు అన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని అంటూ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.