గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. ఆ మహా గణపతికి ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సంవత్సరం భారీ ఎత్తులో వివిధ రూపాలలో కొలువుదీరే గణనాధుడు ఈ సారి దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో దర్శనం ఇవ్వనున్నాడు. అలాగే ఈ గణనాధుడి ఎత్తు 9 అడుగులకే కుదించారు. మట్టితో తయారు చేసిన 9 అడుగుల ఎత్తున్న గణపతికి ఓ వైపు లక్ష్మీదేవి, మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఈ సారి గణనాథుని నిమర్జనం కూడా ఉన్న ప్రదేశంలో చేసేలాగ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే గతేడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహా గణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి కరోనా నేపధ్యంలో తగ్గింది.