వామ్మో.. జర జాగ్రత్త వాడేసిన గ్లౌజ్ లను కడిగి అమ్మేస్తున్నారు…!

-

సమాజంలో కల్తీ మోసగాళ్ళు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇప్పటికే వాడే సబ్బు నుంచి తినే తిండి కూడా కల్తీ మాఫియా చేతిలో నలిగి పోతుంది. తినే ఆహారం కూడా కల్తీ చేస్తే ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు. దీనికి తోడుమహారాష్ట్రలోని ముంబై క్రైమ్ బ్రాంచ్ ఒక ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది. రోగం వచ్చీ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా కల్తీ కేటుగాళ్లు పెరిగి పోయారు. వైద్యులు శస్త్ర చికిత్సలో విరివిగా వాడే చేతి తొడుగులను అందరూ చూసే ఉంటారు. చేతి తొడుగులను శస్త్ర చికిత్స అయిపోయిన తర్వాత వైద్యులు వాటిని వారి చేతుల నుంచి తొలగిస్తారు.

glouses

ఆసుపత్రి వర్గాలు అక్కడ నుంచి చెత్త సహకరించే వారి ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు…. కానీ కొంతమంది ఆసుపత్రుల దగ్గర నుంచి నేరుగా వాటిని సేకరించి కడిగి అమ్మడం మొదలు పెట్టారు. పావ్నే అనే ప్రాంతంలోని ఒక గోడౌన్ వద్ద జరిగిన దాడిలో మూడు టన్నుల ఉపయోగించిన చేతి తొడుగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇక కరోన రోగులకు వాడిన వాటిని కూడా వీరు సేకరించి అమ్ముతున్నారు అని గుర్తించారు. ఇలాంటి నేరాలు సమాజంలో పెరిగిపోతూ ఉంటే ఇంక సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలో, తినే తిండి కల్తీ చేసి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళ్లినా అక్కడ కల్తీ చేస్తే ప్రజలు ఆరోగ్యాలు ఏమి కావాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version