ఖమ్మం అత్యాచార బాధితురాలి మృతి

-

ఖమ్మం అత్యాచారం, ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో బాలిక మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక నిన్న పోద్దుబోయాక మృతి చెందింది. గత నెలలో బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారం చేసి ఆ విషయం ఎక్కడ బయట పెడుతుందో అనే భయంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గాయాలపాలైన 13 ఏళ్ల బాలికకు ముందు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందించారు.

బాలిక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది. మృత్యువుతో 28 రోజులు పోరాడి బాలిక మృతి చెందింది. 17 రోజుల పాటు అసలు ఈ ఘటనని వెలుగులోకి రాకుండా చేశారు నిందితులు, ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది. మీడియా ద్వారా ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆసుపత్రి సీజ్ చేశారు. నిందితుడు మరయ్య పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version