భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఖుషి..ఎన్ని కోట్లంటే..?

-

రీ రిలీజ్ లో కూడా ఖుషి సినిమా సత్తా చాటుతోంది. ఏ ఎమ్ రత్నం నిర్మించిన ఈ సినిమాను ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఖుషి. ఇక సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా..ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా అప్పట్లోనే రిలీజ్ అయ్యి భారీ వసూళ్ళను క్రియేట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీన గత ఏడాది థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్స్ తో తీసుకుపోతూ ఉండడం గమనార్హం.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా 4కే ప్రింట్ లో విడుదల అయ్యి భారీగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇవ్వడం గమనార్హం. అసలు ఈ స్థాయిలో ఖుషి రిలీజ్ కు రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . ఖుషి సినిమా నైజాం ఏరియాలో రూ.1.65 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు నైజాం ఏరియాలో టాప్ రీ రిలీజ్ మూవీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఖుషి సినిమా రూ.1.65 కోట్లు అందుకోగా.. జల్సా సినిమా రూ.1.26 కోట్లను సొంతం చేసుకుంది.

పోకిరి సినిమా రూ.69 లక్షలు, బిల్లా సినిమా రూ.32 లక్షలు , చెన్నకేశవరెడ్డి రూ.21 లక్షలతో టాప్ లిస్టులో కొనసాగుతున్నాయి. మొత్తంగా రీ రిలీజ్ లో మొదటి రోజు కలెక్షన్స్ లో ఖుషి సినిమా రూ.3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తో పాటు సినిమాలోని సరికొత్త స్టైల్ కూడా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version