తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లాలో ఓ యువతి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం. అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువతిని కొందరు దుండగులు వెంబడించి మరీ కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు.
విషయం తెలిసి తల్లిదండ్రులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. కిడ్నాప్ చేసిన యువతిని హైదరాబాద్-వరంగల్ హైవేపై భువనగిరివైపు తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. యువతి ఫోన్ నెట్వర్క్ ద్వారా ట్రాక్ చేసినట్లు సమాచారం. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా,సమీప బంధువులే ఆ యువతిని అపహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.