నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించిన పోలీసులు

-

హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం ఓ చిన్నారి కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాంపల్లి పోలీసులు 6 గంటల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెల రోజుల బాబుకు పచ్చ కామెర్లు వచ్చాయి.దీంతో నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు.

నిన్న రాత్రి హసీనా బేగం బాబును ఎత్తుకొని ఉండగా.. ఆసుపత్రి సిబ్బంది అని తల్లిని నమ్మించిన ఓ మహిళ బాబుని ఎత్తుకొని అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత ఎంతకూ ఆమె రాకపోయే సరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే పరిగి వద్ద కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం చిన్నారిని సురక్షితంగా తల్లివద్దకు చేర్చారు.ఈ కేసులో కిడ్నాప్ చేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news