ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే.. మీకు కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే….!

-

చ‌ర్మం అనుకోకుండా బాగా పొడి బారుతున్నా కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు గుర్తించాలి. అలాగే మూత్రంలో మంట‌, మూత్రం రంగు మార‌డం, హైబీపీ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కిడ్నీ స‌మ‌స్య‌లు ఉంటాయి.

 

మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కిడ్నీలు వ‌డ‌బోస్తుంటాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే కిడ్నీల స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే అప్పుడు మ‌న శ‌రీరం విష తుల్యం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రు కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే ఒక‌వేళ కిడ్నీ స‌మ‌స్య‌లు వస్తే గ‌న‌క మ‌నకు ముందుగానే కొన్ని ల‌క్ష‌ణాలు మన శ‌రీరంలో క‌నిపిస్తుంటాయి. వాటిని ముందే తెలుసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారికి వారి శరీరంలో ముందుగానే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న వారు ఎప్పుడూ నీర‌సంగా ఉంటారు. ఏ ప‌ని చేయలేనంత బ‌ల‌హీనంగా త‌యార‌వుతారు. ఎందుకంటే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉంటే శ‌రీరం విట‌మిన్ డిని గ్రహించ‌లేదు. దీంతో ఎరిత్రోపొయెటిన్ అనే హార్మోన్ విడుద‌ల కాదు. ఫ‌లితంగా ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంది. దీంతో ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. ఫ‌లితంగా కండ‌రాలు, మెద‌డు బ‌ల‌హీనంగా అయి.. నీర‌సం, అల‌స‌ట వ‌స్తాయి.

2. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారి నాలుక‌పై ఉండే రుచి క‌ళిక‌ల ప్ర‌భావం త‌గ్గుతుంది. అందువ‌ల్ల వారు రుచుల‌ను స‌రిగ్గా గుర్తించ‌లేరు.

3. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారి నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. నోటి పూత వ‌స్తుంది. అలాగే పాదాలు, చేతుల్లో వాపులు వ‌స్తుంటాయి.

4. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉంటే క‌ళ్లు వాపుల‌కు గుర‌వుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది.

5. చ‌ర్మం అనుకోకుండా బాగా పొడి బారుతున్నా కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు గుర్తించాలి. అలాగే మూత్రంలో మంట‌, మూత్రం రంగు మార‌డం, హైబీపీ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కిడ్నీ స‌మ‌స్య‌లు ఉంటాయి. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా క‌నిపిస్తే నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. వెంట‌నే వైద్యున్ని క‌ల‌సి చికిత్స తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version