దారుణం; అన్నం లేక కప్పలను కాల్చుకు తిన్న పిల్లలు…!

-

డబ్బులున్న వాడికి లాక్ డౌన్ అనేది బాగానే ఉంటుంది. సాయి కుమార్ చెప్పినట్టు కావాల్సినవి వండించుకుని తినే అవకాశం ఉంటుంది. కాని ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటీ…? జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు జనాలు తిండి కోసం అలమటిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో తిండి లేక పిల్లలు ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలించడం లేదు.

ఆ రాష్ట్రాల్లో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్లకు అక్కడ చేసుకోవడానికి పని కూడా ఉండదు. దీనితో ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు అక్కడ. తాజాగా వచ్చిన ఒక వార్త కన్నీరు పెడుతుంది. బీహార్ లో పిల్లలు కప్పలను కాల్చుకుని తినే పరిస్థితి వచ్చింది. బిహార్ లోని జెహనాబాద్ కు చెందిన చిన్నారులకు గత ఐదురోజులుగా తిండి లేకపోవడంతో కప్పలను తిన్న ఫోటోలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

గుంతల్లో, మురికి కాలువలో ఉన్న కప్పలను వేటాడి చంపి, వాటిని కాల్చుకుని తిన్నారు. కప్పలను ఎందుకు తింటున్నారు అని అడగగా… తమకు తిండి లేదని, 5 రోజులుగా తినడానికి ఏమీ లేవని ఆందోళనగా చెప్పారు. ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఈ విచారణకు ఆదేశించి, వెంటనే పిల్లలకు ఆహారం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version