ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తా.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు దాదాపు 10 రోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ చివరి రోజు సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని పేర్కొన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు 4.0ను చూస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. 

CM Chandrababu

కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలిస్తోంది. ఇక్కడ కూడా అదే రకమైన పాలన ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. డిసెంబర్ లో అమరావతి పనులను ప్రారంభించి మూడేళ్లలో రాజధానికి ఓ రూపం తీసుకొస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా ఆఫీసర్ల క్వార్టర్స్, గ్రూప్-డి, గ్రూప్ -బి 9 నెలల్లో గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు, ఎన్జీవో, ఆలిండియా సర్విసెస్ భవనాలు పూర్తి అవుతాయని వెల్లడించారు. డిసెంబర్ నుంచి గేర్ మారుస్తానని.. మీరు నాతో పని చేయాలన్నారు. అమరావతి ఇప్పటివరకు పూర్తయితే.. సంవత్సరానికి రూ.10వేల నుంచి రూ.15వేల కోట్లు వచ్చేవి అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version