కిమ్ జోంగ్ ఉన్… ప్రపంచాన్ని భయపెట్టే వ్యక్తి. తేడా వస్తే సొంత భార్య అయినా పిల్లలు అయినా సరే వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. చంపడ౦ ఒక్కటే అతనికి తెలుసు. ఉత్తర కొరియాలో కరోనా కేసు వస్తే అధికారులను చంపేస్తా అని బెదిరించడం తో దేశంలో ఒక్క కరోనా కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. అలాంటి వ్యక్తి కిమ్ జోంగ్. కాని అలాంటి వ్యక్తికి కూడా భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు.
ఆయనకు ఈ భూమి మీద తన చెల్లి అంటే అమితమైన ప్రేమ అని ప్రపంచ౦ చెప్తుంది. ఆమె పెద్దగా మీడియా లో కనపడకపోయినా సరే ఆమె మాత్రం ఒక సంచలన౦. ఆమె పేరు కిమ్ యో జోంగ్. ఆమె వయసు 31 ఏళ్ళు. ఆమె ఒకరు ఉన్నారు అని ప్రపంచానికి తెలిసిందే పదేళ్ళ కిందట. అన్న ఆరోగ్యం విషమంగా ఉండటం తో ఆమె పాలనా పగ్గాలు చేపడుతుంది అనే ప్రచారం జరుగుతుంది.
అయితే అసలు అతన్ని అలా తయారు చేసింది చెల్లెలే అనేది ఇప్పుడు వినపడుతున్న మాట. పరిపాలనాదక్షుడిగా, శక్తిమంతమైన నాయకుడిగా దేశ ప్రజల్లోకి, విదేశాలకు పరిచయం చేసింది ఆమె అని అంటున్నారు. 2008 వాళ్ల తండ్రి జోంగ్ ఇల్ చనిపోయినప్పుడు కిమ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె అన్నీ తానై వ్యవహరిస్తుంది. సొంత నీడను కూడా నమ్మని కిమ్ కి ఆమె చెల్లెలు అంటే అపార నమ్మకం.
2010 లో ఆమె పార్టీ సమావేశంలో పాల్గొన్న సమయంలో తొలిసారి ఫోటో బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె మీడియాలో ఎక్కువగా కనపడుతుంది. అమెరికా కొరియా చర్చల సమయంలో ఆమె కీలక పాత్ర వహించడం తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెను అభినందించారు. ఆరు నెలల క్రితం సరిహద్దుల్లో సైనిక కవాతు నిర్వహించిన సమయంలో దక్షిణ కొరియా ఉత్తర కొరియాకు వార్నింగ్ ఇచ్చింది.
అప్పుడే ఆమె అరిచే కుక్క కరవదు అని ఎద్దేవా చేసింది. కిమ్ వ్యూహాల్లో ఆమె పాత్ర ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇద్దరూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో కలిసి చదువుకున్నారని అంటారు. అన్ని తనిఖీలు ఉంటే గాని సొంత పిల్లలను అయినా కలిసే అవకాశం లేదు కిమ్. అలాంటిది ఈమెకు ఏ ఒక్క తనిఖీ ఉండదు. ఆమె కిమ్ కన్నా భయంకరంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనేది కొందరి మాట.