Breaking : కేన్సర్ రోగులకు శుభవార్త.. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన నిమ్స్‌

-

కేన్సర్‌ రోగులకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్) శుభవార్త చెప్పింది. ఆసుపత్రిలో చేరుకుండానే కీమోథెరపీ చేయించుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది నిమ్స్‌. ఈ మేరకు నిమ్స్‌ కీమో థెరపీ డే కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆరోగ్య శ్రీ కార్డుదారులతోపాటు ఆరోగ్యకార్డులున్న ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా చికిత్స పొందే సదుపాయం కల్పించారు నిమ్స్‌ అధికారులు. నేటి నుంచే ఇది అందుబాటులోకి రానుంది. నిజానికి కేన్సర్ రోగులకు కీమోథెరపీ చేయాలంటే కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సిందే. ఆ తర్వాత నాలుగైదు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. గ్రామాల నుంచి వచ్చే రోగులకు ఇది ఇబ్బందికరంగా ఉండేది.

బోల్డంత సమయం వృథా అయ్యేది. నిమ్స్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చిన కీమోథెరపీ డే కేర్ కేంద్రం ద్వారా పేదలకు వేగంగా, ఉచితంగా కీమో థెరపీ సేవలు అందించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సదాశివుడు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా 30 పడకలు ఏర్పాటు చేశామని, రోజుకు వందమందికి ఇక్కడ చికిత్స అందించేందుకు వీలవుతుందని వివరించారు ప్రొఫెసర్ సదాశివుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version