క్రెడిట్ కార్డుని వాడడం లేదా..? అయితే ఇలా సింపుల్ గా క్లోజ్ చేసేయచ్చు..ఆలస్యమైతే కంపెనీకే పెనాల్టీ..!

-

క్రెడిట్ కార్డులను ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ తో పేమెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. పైగా ఎక్కువ క్యాష్ మనం తీసుకు వెళ్లకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ తో ఈజీగా పేమెంట్ చేసేయచ్చు. నిజానికి క్రెడిట్ కార్డుల వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. అయితే వీటి వలన సమస్యలూ వున్నాయి. కార్డు వాడే వారు జాగ్రత్తగా ఉండాలి.

ఇష్టం వచ్చినట్టు వాడితే చిక్కుల్లో పడడం పక్కా. ఆఫర్లు, రివార్డు పాయింట్లు, ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ వంటి లాభాలను క్రెడిట్ కార్డ్స్ తో పొందొచ్చు. కానీ సరిగ్గా వీటిని ఉపయోగించలేదు అంటే రుణ సంక్షోభంలో కూరుకుపోవాల్సి వస్తుంది. కనుక క్రెడిట్ కార్డు బిల్ ని పూర్తిగా చెల్లించాలి. కానీ పే చెయ్యకుండా పదే పదే కార్డుని వాడుతుంటే సమస్యలు వస్తాయి.

మీకు క్రెడిట్ కార్డు ని కనుక క్లోజ్ చెయ్యాలంటే ఇలా చెయ్యచ్చట. క్రెడిట్ కార్డు క్లోజింగ్ అంశానికి సంబంధించి రూల్స్‌ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. క్రెడిట్ కార్డు క్లోజింగ్‌కు సంబంధించి ఎలాంటి రిక్వెస్ట్ వచ్చినా వెంటనే ప్రాసెస్ చెయ్యాలని అంది. కంపెనీలు కస్టమర్ల నుంచి రిక్వెస్ట్ అందిన ఏడు పని దినాల్లో క్రెడిట్ కార్డు క్లోజ్ చేసేయాలి.

కార్డుని క్లోజ్ చెయ్యాలంటే ఇలా చేయండి:

ఏ పేమెంట్స్ ని మీరు పెండింగ్ లో పెట్టద్దు. అన్నీ క్లియర్ చేసుకోవాలి.
ఈమెయిల్, ఐవీఆర్, అధికారిక వెబ్‌సైట్‌లో లింక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, హెల్ప్‌లైన్ నెంబర్ వంటివి అందుబాటులో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ కంపెనీలకు చెప్పింది. కనుక ఈ పద్దతుల ద్వారా క్లోజ్ చేయడం సులభం.
అలానే పోస్ట్ ద్వారా క్రెడిట్ కార్డు క్లోజింగ్ రిక్వెస్ట్ పంపాలని కంపెనీలు అనకూడదని కూడా చెప్పేసింది. క్రెడిట్ కార్డు కంపెనీ కార్డును వారం రోజుల్లోగా క్లోజ్ చెయ్యకపోతే రూ. 500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మనీ కస్టమర్స్ కి వస్తాయట.
కనుక కార్డు క్లోజ్ విషయంలో కస్టమర్స్ వీటిని చూసి క్రేడిట్ కార్డు కంపెనీలను అడగొచ్చు. అంతే తప్ప ఇబ్బంది పడకండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version