సాధారణంగా పాములను చూస్తే చాలు జనాలు భయంతో పరుగులు తీస్తుంటారు. ఎందుకంటే అవి చాలా విషపూరితం. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా పాములు కాటేసి జనాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, పాములు సైతం ప్రాణభయంతో పరుగులు తీస్తుంటాయి. ఎక్కడ ప్రజలు తనకు హానీ చేస్తారేమో అని వాటి భయం వాటికి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 15 అడుగుల భారీ పాము రైతులను భయపెట్టింది. వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవ్వగా… పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో కింగ్ కోబ్రా పడగ విప్పి రైతులపైకి దూసుకొచ్చింది.అలా కాస్త దూరం వారిని వెంటాడటంతో రైతులు భయంతో చెట్ల పొదల్లో నుంచి పరుగులు తీశారు.
భారీ పాము కలకలం
అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ పాము రైతులను భయపెట్టింది. పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో పాము రైతులపై దూసుకొచ్చింది….రైతులు భయంతో పరుగులు తీశారు. pic.twitter.com/bjRl9yY7By
— ChotaNews App (@ChotaNewsApp) March 29, 2025