సెంచరీతో చెల‌రేగిన రాహుల్‌.. బెంగ‌ళూరు ల‌క్ష్యం 207..

-

దుబాయ్ లో గురువారం జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 6వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెల‌రేగాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 132 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పంజాబ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 206 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

కాగా కేఎల్ రాహుల్ సెంచ‌రీకి ముందు రెండు సార్లు అత‌ను ఇచ్చిన క్యాచ్‌ల‌ను బెంగ‌ళూరు కెప్టెన్ కోహ్లి వ‌దిలేశాడు. దీంతో రాహుల్‌కు రెండు సార్లు లైఫ్ ల‌భించింది. అదే బెంగ‌ళూరుకు మింగుడు ప‌డ‌ని విషయంగా మారింది. ఈ క్ర‌మంలో పంజాబ్ జ‌ట్టు భారీ ల‌క్ష్యాన్ని బెంగళూరు ఎదుట ఉంచ‌గ‌లిగింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో శివం దూబె 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, చాహ‌ల్ 1 వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version