రూ.లక్షకు రూ.2 లక్షలని ఇలా పొందొచ్చు..!

-

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బులని ఏదైనా స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా మీ దగ్గర వుండే డబ్బులని ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని భావిస్తున్నారా..? అయితే మీకు చాలా దారులు వున్నాయి. అయితే వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే మనం చెప్పుకోచ్చు.

money

దీనిలో డబ్బులు పెడితే ఏ రిస్క్ కూడా ఉండదు. పైగా మంచిగా రాబడిని కూడా పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్టాఫీస్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. డబ్బులు ఇందులో పెడితే రాబడి రెట్టింపు వస్తుంది. దీనిలో డబ్బులుని ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు వస్తాయి. ఇక దీనిలో డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే…

ఈ డబ్బులు కోసం దీర్ఘకాలం వేచి ఉండాలి. 124 నెలల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయి. ఇది ఇలా ఉంటే ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుస్తూ వుంటారు.

కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. మీరు కనుక కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ ఓపెన్ చెయ్యాలని అనుకుంటే రూ.1000తో తెరవొచ్చు. దీనిలో ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోచ్చు. ఎలాంటి లిమిట్ అనేది లేదు. మెచూరిటీ కంటే కూడా ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు. కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version