స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎప్పటికీ ఉండాలని ఆకాంక్ష : కిషన్‌ రెడ్డి

-

వందల సంఖ్యలో స్వాములందరికీ ఈరోజు పడి పూజ చేయించి అన్నదాన నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత, సేవాగుణం అలవడతాయన్నారు. స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు.  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా మహా పడిపూజోత్సవం నిర్వహించారు. 22 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కిషన్‌ రెడ్డి. అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన నారాయణగూడ. కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, ఇది కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్.. రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డితో కలిసి మీడియాతో కిషన్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీని కల్వకుంట్ల అధికారిక కంపెనీగా మార్చేశారు. సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగరేణి కార్మికులకు హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటు, కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ తదితర హామీలు ఇచ్చి మొండి చేయి చూపింది కేసీఆర్ కాదా?” అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version