మోదీ మళ్లీ పిఎం అవడం ఖాయం: కిషన్ రెడ్డి

-

ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇదే విధంగా నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియం కు వచ్చి మీటింగ్ కు పెట్టి వెళ్లిన తర్వాత ప్రధాని అయ్యారు అంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతోందని అందుకే బీజేపీ ప్రజల క్షేమం కోసం అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణాలో BRS, కాంగ్రెస్ మరియు ఎంఐఎం లు అంతా ఒకే కోవకు చెందినవారంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు కూడా కేసీఆర్ కు అమ్ముడుపోతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.

మరో మూడు వారాలలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, లేదా BRS లను గెలిపిస్తే తెలంగాణ ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతుందని కిషన్ రెడ్డి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version