బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం అ దృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎల్బీ స్టేడియంతో నాకు అనుబంధం ఉంది. ఇదే గ్రౌండ్ లో ప్రజలు నన్ను ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యానని తెలిపారు ప్రధాని మోడీ. ఇదే మైదానం సాక్షిగా బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రధాని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేక ప్రభుత్వముందని తెలిపారు ప్రధాని మోడీ.
కాంగ్రెస్, బీఆర్ఎస్ C టీమ్ ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్ గా ఉన్నాయని తెలిపారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీనే. దళితుడిని లోక్ సభ స్పీకర్ బాలయోగిని చేసింది బీజేపీనే.. తొలిసారిగా ఎస్టీ మహిళాను కూడా రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తనను కూడా దేశ ప్రజలు రెండు సార్లు ప్రధానిగా చేశారని తెలిపారు. కేంద్ర క్యాబినెట్ లో అత్యధికంగా బీసీలున్నారు.