కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలనే ఆలోచన మాకు లేదు : కిషన్‌రెడ్డి

-

ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన ఎంపీ అర్వింద్‌ ఇంటి వద్దకు చేరుకుని అర్వింద్‌ మాతృమూర్తిని పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ సమక్షంలోనే దాడి జరిగింది… పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. రాష్ట్ర రాజధాని లో… ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలో దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందో అర్థం చేసుకోవచ్చు. అహంకారపూరితంగా… నిరాశ నిస్పృహలతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.వచ్చే అక్టోబర్ వరకు సర్వేలు ఆపండి. ఓడిపోతామనే భయం… సీఎం కుర్చీ వద్సలాల్సి వస్తుందనే భయంతో దాడులు చేయిస్తున్నారు. రాష్టాన్ని రాక్షస రాజ్యం… నిజాం రాజ్యంగా రాష్టాన్ని మారుస్తున్నారు. ఇలాంటి చర్యలు రాష్టానికి నష్టం చేకూరుస్తున్నాయి.

ప్రతి విమర్శలు చేసుకోవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి కుమారుడు ప్రధానిని అనరని మాటలు అన్నారు. ప్రధాని ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. బీజేపీ కి నాయకత్వ, అధికార కాంక్ష లేదు. దేశం కోసం, సిద్దాంతం కోసం పని చేస్తాం. బీజేపీకి ఎలాంటి తొందర లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోవలనే ఆలోచన లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చాలని కేసీఆర్ చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన లేదు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని మాకు లేదు. తెలంగాణ సమాజం మా వెంట ఉంది. సిద్ధాంతం, పార్టీ మీద విశ్వాసం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటాము. ఇతర పార్టీల వారిని టిఆర్ఎస్ లో చేర్చుకునే నేర్పరితనం ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కే. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను మొట్టమొదటిగా కేసు పెట్టి విచారించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల మెప్పు కోసం, ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులు, బెదిరింపులను తెలంగాణ సమాజం మెచ్చుకోదు.’ అని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version