లేడీ సూపర్‌స్టార్ నయనతార కనెక్ట్‌ టీజర్‌ రిలీజ్‌

-

కాత్తువాకుల రెండు కాదల్” చిత్రం తదుపరి కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నుండి రాబోతున్న సరికొత్త చిత్రం “కనెక్ట్”. బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు నయన్ బర్త్ డే కావడంతో, ఆమె బర్త్ డే ట్రీట్ గా మేకర్స్ కనెక్ట్ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు. అప్‌డేట్ ప్రకారం నయనతార పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కనెక్ట్‌ టీజర్‌ను విడుదల చేశారు. నయనతార తన గదిలో భయంభయంగా కనిపిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి డోర్‌ను కొడుతున్నాడు. బ్యాక్‌ డ్రాప్‌లో భయంతో కూడిన అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.

ఇంకో రూం తలుపు తెరవగా.. బెడ్‌పై షాక్‌ లుక్‌లో ఉన్న యువతి కనిపిస్తుంది. టీజర్‌లోనే సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తూ.. అసలేం జరుగుతోందని ఆలోచింపజేస్తూ.. హార్రర్‌ థ్రిల్లర్స్‌ ను ఇష్టపడే మూవీ లవర్స్‌ లో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్‌. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కిస్తుండగా.. పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version