ఓపెనర్ గానే కాదు, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని kl రాహుల్ తెలిపారు. మరో రెండు రోజుల్లో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు తెరలేవనుంది. నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. అయితే ఈ తొలిటెస్ట్ కు ముందు వైస్ కెప్టెన్ హోదాలో కేఎల్ రాహుల్ మీడియా ముందుకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేఎల్ రాహుల్ స్పందించాడు. తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు రాహుల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
“నిజం చెప్పాలంటే మేము ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. టెస్ట్, వన్డేలు, t20 లు ఇలా ఒక్కో ఫార్మాట్ లో ఒక్కో ఆటతీరు ఉంటుంది. కాబట్టి ఇలా ఆడాలి, అలా ఆడాలి అని ఆలోచించం. ఒక బౌలర్ ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయి. భారతలో పిచ్ లు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో ఎవరికీ తెలియవు. ఇక నేను ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాను అనేది జట్టు నిర్ణయం. ఒకవేళ నా సేవలు మిడిల్ ఆర్డర్ లో అవసరం అనుకుంటే అక్కడే వస్తాను. లేదు ఓపెనర్ గా కావాలనుకుంటే అందుకు కూడా రెడీ. పరుగులు చేయడమే ముఖ్యం” అని చెప్పుకొచ్చాడు.