ప్రతిపక్షాలకి ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..!

-

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని చెప్పారు. గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ని ఎవ్వరూ ఓడించలేరు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం.

మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన నా కాళ్లు కడిగారు అని నాని అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల మాదిరి వాళ్ళ డప్పులు వాళ్లే కొట్టుకుంటు వాళ్ళ దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news