ఆత్మ హ‌త్యెందుకు నాని? అంత సాహ‌సం వ‌ద్దులే!

-

ఆత్మ‌హత్య మ‌హాపాత‌కం నాని గారూ..వ‌ద్దు వ‌ద్దు మా మాట వినండి మాకు తెలుసు మీరు ఫైర్ బ్రాండ్ రాజ‌కీయాలు న‌డిపేందు కు ఎన్న‌డూ సిద్ధంగానే ఉంటార‌ని..! కానీ ఈ సారి మాత్రం అక్క‌డ ఏం జ‌ర‌గ‌లేద‌ని మేం కూడా మీ మాటే శాస‌నం అని అనుకుని ముందుకు వెళ్తున్నాం.మ‌మ్మ‌ల్ని మీరు అపార్థం చేసుకోకండి ప్లీజ్ !

Kodali Nani

మేం చిన్న‌వాళ్లం మేం కోరుకుంటున్న‌ది మీ నుంచి ఇది కా దు అని మాత్ర‌మే విన్నవిస్తున్నాం. మా వాద‌న వినిపిస్తున్నాం. అయినా కూడా స‌మ‌స్య మాత్రం మీది కాదు..మాది కూడా కా దు అంతా కాలం చేసిన త‌ప్పిదం..అందులో భాగంగా క్యాసినో అక్క‌డ ఏర్పాటు చేసి ఉంటార‌ని ఏమ‌ర‌పాటుగా ఉన్న మీడియా కు తె లిసింది..అదే స‌మ‌యంలో ఏ మాత్రం ఏమ‌రుపాటుగా లేని టీడీపీ కూడా తెలుసుకుంది. ఇంకేం వివాదం రాజుకుంది.ఈ పాటి కూ డా తెలియ‌కుండా ఉంటే అస్స‌లు త‌గువే లేదు. అయినా మీరు త‌ప్పు చేసినా ఎవ్వ‌రు త‌ప్పు చేసినా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జైల్లో వే స్తార‌ని మ‌రోమంత్రి పేర్ని నాని చెప్పేరండి..విన్నాం కానీ అది నిజం కాద‌ని తెల్సుకున్నాం కూడా! నిజం అయ్యే మాట‌లేవీ మంత్రి వ‌ర్గానికి చెందిన వారెవ్వ‌రూ బాహాటంగా మీడియా ముందు ఎప్పుడూ చెప్ప‌లేదు..చెప్ప‌రు కూడా!

గుడివాడ కె క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో క్యాసినో నిర్వ‌హించాన‌ని నిరూపిస్తే త‌క్ష‌ణం రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని పెట్రోల్ పోసుకుని ఆ త్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న ప్ర‌కట‌న చేయ‌డంతో విజ‌య‌వాడ న‌గ‌రం ఉలిక్కిప‌డింది.కృష్ణా న‌దిలో నీళ్ల లో ఒక్క‌సారిగా సుడులు రేగాయి.ఒక్కసారిగా అల‌జ‌డులు రేగాయి. ఏ క్ష‌ణాన ఏమౌతుందో అన్న బెంగ‌తో మీడియా ఛానెళ్లు అబ ద్ధాలు కాకుండా నిజాలు రాయ‌డం మొద‌లెట్టాయి. ఇన్ని జ‌రిగినా కూడా జ‌గ‌న్ మాత్రం నోరు మెద‌ప‌కుండా అన్ని ప‌రిణామాల‌ను ఆస‌క్తి చూడ‌డం ఓ విడ్డూరం లేదా వింత.వ్యంగ్యార్థంగా తోచినప్ప‌టికీ ఇదే నిజం కూడా!

సంక్రాంతి సంద‌ర్భంగా అక్క‌డ అస్స‌లు ఏమీ జ‌ర‌గ‌లేదు.అక్కడ పేకాట లేదు.క్యాసినో లేదు. ఇంకా క్యాబరే డ్యాన్సులు కూడా లేవు..అని కొడాలి నాని ప‌దే ప‌దే చెబుతున్నా అయ్యో! టీడీపీ వినిపించుకోవ‌డం లేదు.నిజ నిర్థార‌ణ అంటూ హ‌డావుడి చేస్తుంది. కానీ అక్క‌డ జ‌రిగిందేదీ లోకానికి తెలియ‌దు. ప్రెస్సుకూ పోలీసుకూ తెలియ‌దు అని నాని అంటుంటే పాపం టీడీపీ వినిపించుకోకుండా రాజ‌కీయంలో దూసుకుపోతుంది.పోనీ లేండి నాని గారు మీరు చెట్ల కింద పేకాట ఎలానూ ఆప‌లేన‌ని గ‌తంలో ఓ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వార్నింగ్ ఇచ్చి మ‌రీ చెప్పారు బాగుంది.. ఇప్పుడేమో చంద్ర‌బాబుకు వార్నింగ్ ఇచ్చి మ‌రీ చెబుతున్నారు.ఏం కాదు వాళ్ల‌దే త‌ప్పు మీ గురించి వాళ్లు త‌ప్పుగా ఆలోచించ‌డ‌మే పెద్ద త‌ప్పు.. వాళ్ల‌నూ, ఇంకా ఇత‌ర మీడియానూ క్ష‌మించేయండి సర్.. ఏం కాదు. ఇదంతా వ్యంగ్యార్థ రీతిలో రాసినా ఇదే నిజం కూడా!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version