తిరుమల డిక్లరేషన్ అనేది రాజకీయ పర్టీల పెద్దలు తెచ్చిన విధానమే అని మంత్రి కొడాలి నానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సిఎం గా ఉన్న సమయంలో డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని అన్నారు. సిఎం జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ వెళ్ళిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వలేదు కదా అని ఆయన గుర్తు చేసారు.
కాగా తిరుమల డిక్లరేషన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డిక్లరేషన్ పై టీటీడీ చిర్మన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత ఆయన వెనక్కు తగ్గి కేవలం సిఎం జగన్ కు మాత్రమే అని అన్నారు. ఇక దీనిపై అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. బిజెపి, టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.ఎక్కడా లేనిదీ తిరుమలలో ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఏ గుడికి చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకు అన్నారు.