సీపీఐ నారాయణపై కొడాలి సెటైర్లు.. ఆయనో వింత జంతువు

-

సీపీఐ నారాయణపై కొడాలి నాని సెటైర్లు వేశారు. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు అని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడని.. తానో జాతీయ నాయకుడట అంటూ చురకలు అంటించారు. రెండు ఎమ్పీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అని.. మాకు 28 మంది ఎమ్పీలు ఉన్నారన్నారు. వివేకానంద రెడ్డి హత్యలో జగన్ కుటుంబం పాత్ర ఉందంటాడని.. బిగ్ బాస్ షో వ్యభిచార కొంప అంటాడని సీపీఐ నారాయణ పై ఫైర్ అయ్యారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు చంద్రబాబు శుభాభినందనలు చెబుతున్నాడని.. తండ్రి, కొడుకులు ఇద్దరికీ మైండ్ చెడి పోయిందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, నారాయణ, జనసేన… వీళ్ళందరూ ఎవరైనా పది మందిని చంపి జగన్ మీద తోయవచ్చని ప్లాన్ చేస్తున్నారని నాకనిపిస్తోందన్నారు.

అటు భీమ్లా నాయక్ సినిమా పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి లాంటి సినిమాను పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కొడాలి నాని. అఖండ, బంగార్రాజు సినిమాలు ఎంతో తమకు భీమ్లా నాయక్ సినిమా కూడా అంతేనని కొడాలి నాని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన టికెట్ల రేట్లు మేము పెంచుతామని చెప్పామా అని నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version