రేవంత్ రెడ్డి ఓ జోకర్… ఆయనకు చిప్ దొబ్బంది, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించండి- బాల్క సుమన్

-

కాంగ్రెస్ పీసీపీ ప్రెసిడెంట్  ఎటువంటి భాష పరిజ్ణానం లేకుండా జోకర్ లా మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్. తెలంగాణ సమాజం ఆయనను చూసి నవ్వుతోందని ఆయన అన్నారు. చంచల్ గూడ చిప్పకూడు తిన్నప్పటి నుంచి చిప్ దొబ్బినట్లుందని.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని.. చికిత్సకు అయ్యే ఖర్చును కూడా మేమే భరిస్తామని విమర్శించారు. ఇప్పటికైానా అడ్డగోలు మాటలు మాట్లాడితే.. నీ భరతం పడతామని హెచ్చిరించారు. తెలంగాణ ప్రజలు దేవుడిలా కొలుస్తున్న కేసీఆర్ ను తిడుతున్నావని..కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ మెడకు ఉరితాడు వేస్తారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు బాల్క సుమన్. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని విమర్శిస్తే.. పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీకి మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించారని ఆయన వెల్లడించారు. తెలంగాణ సమాజం, కాంగ్రెస్ కార్యకర్తలే నీకు బుద్ధి చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే.. స్కాములు, వేలకోట్లు, అవినీతి తప్ప వేరే ముచ్చటే లేదని.. విమర్శించారు. పీసీసీ కూడా రేవంత్ విషయంలో ఆలోచించాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version