కొడాలి నానికి టికెట్ ఇచ్చి ఆదుకుంది చంద్రబాబేనని విమర్శించిన మాజీ మంత్రి దేవినేని మీద కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఉమక్కాయ్ అంటూ మొదలు పెట్టిన కొడాలి ఉమా చరిత్ర ప్రజలందరికీ తెలుసని తనను మాట్లాడితే క్లీనర్, డ్రైవర్ అంటున్నావ్ నువ్వేమైనా మైసూర్ మహారాజువా..? అని ఆయన ప్రశ్నించారు. నీ తండ్రి సోడాలు కొట్టేవాడు నువ్వు వాటిని కడిగేవాడివని అన్నారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడన్న నాని ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు నాని.
ఇక షోడాలు అమ్ముకొని వచ్చిన దేవినేని ఉమా…తనకు చాలెంజ్‌లు విసరడమేంటని ఫైర్ అయ్యారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు. అలానే చంద్రబాబు ఓ దళారి అంటూ కొడాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యవసాయ దారుడు కాదన్న ఆయన రైతులు పండించే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి హెరిటేజ్‌లో అమ్ముకుంటాడని ధ్వజమెత్తారు.
అచ్చెన్నాయుడి మీద కూడా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చిన్న ఆపరేషన్ అయిన వ్యక్తి హాస్పిటల్‌లో 70రోజులు ఎవరైనా ఉంటారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొడాలి.