ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? అని చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబును పిచ్చాసుపత్రిలో గానీ, జైల్లో గాని పెట్టాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మైకులు ఎక్కడ కనబడితే అక్కడ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయనకు బాలయ్య పూనినట్లు ఉన్నారని ఆరోపించారు.
గన్నవరం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. లోకేష్ బ్రెయిన్ లెస్ కిడ్ అంటూ విరుచుకుపడ్డారు. రాజ్యాంగం గురించి లోకేష్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. నేను, వంశీ వస్తాం.. నువ్వు రెడీ నా బాబు? అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందామన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? ఎక్కడ కొట్టుకుందాం? చెప్పు పైకి పోదామా? జైల్‌కు పోదామా? అని సవాల్ చేశారు కొడాలి నాని.