ఉడకపెట్టిన గుడ్డును ఆలస్యంగా తింటున్నారా..? అమ్మో చాలా ప్రమాదం..

-

కోడిగుడ్డును డైలీ ఒకటి తింటే.. ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.. అందులోను ఉడకబెట్టిన గుడ్డు అయితే ఇంకా మంచిది.. కరోనా తర్వతా అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది.. ప్రోటీన్స్‌ ఉండే ఆహారాలను డైట్‌లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. చాలామంది డైలీ కోడిగుడ్డను కచ్చితంగా తింటున్నారు. అయితే ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడానికి ఒక టైమ్‌ ఉంటుంది. మీరు ఎప్పుడో ఎగ్‌ బాయిల్‌ చేసి.. అన్ని పనులు అయ్యాక ఏ గంటకో రెండు గంటలకో తిందాం అనుకుంటే తప్పే.. ఇంకొంతమంది అయితే.. ఎగ్‌ బాయిల్‌ చేసి..పైన పొట్టు తీసేసుకుని లంచ్‌ బాక్స్‌లో పెట్టుకోని ఆఫీసులకు వెళ్తారు. ఇలా చేస్తే.. మీరు ఎగ్‌ తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా.. ఇంకా సమస్యలేనట..!
ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాలని వైద్య నిపుణులు అంటున్నారు.. ఆలస్యం చేస్తే గుడ్లు గాలికి ప్రభావితం అవుతాయి. గాలిలో ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు గుడ్లపై వ్యాప్తి చెందుతాయి. మీరు అనుకోవచ్చు.. మేమం ఇంట్లో మూతపెట్టి ఉంచుతాం కదా.. గాలి ఎలా వెళ్తుంది.. వెళ్తుంది అంతే..! దీంతో ఎక్కువ సమయం పాటు ఉంచిన గుడ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల కోడిగుడ్లను ఉడకబెడితే వెంటనే తినాల్సి ఉంటుంది. అస్సలు ఆలస్యం చేయకూడదు..
కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత వాటి మీద ఉండే పొట్టును తీసి అలా ఉంచొద్దు…పొట్టును తీస్తే గుడ్డుపై బాక్టీరియా ప్రభావం పడుతుంది. పొట్టును తీయకుండా ఉంటే గుడ్లను ఎక్కువ సేపు ఉంచి కూడా తినవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. కానీ గుడ్డును ఉడకబెట్టిన తరువాత పగిలితే మాత్రం వెంటనే పొట్టును తీసేసి తినాలి. అలాగే అస్సలు ఉంచరాదు.
కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత పొట్టు తీసి చాలా సేపటికి తింటాం.. అంటే వాటిని ఒక పాత్రలో ఉంచి మూత పెట్టి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు తాజాగా ఉంటాయి. గుడ్లను 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎంత సేపైనా నిల్వ చేయవచ్చు. ఈ విధంగా ఉడకబెట్టిన గుడ్లను తింటే ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యంగా ఉంటాము.
ఈ సోదంతా ఎందుకురా అనుకుంటే.. మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారో అప్పుడే గుడ్డును ఉడకపెట్టుకోని చక్కగా వేడిగా ఉన్నప్పుడే లాగించేయండి.. అసలు ఏ సమస్యా ఉండదు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version