సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు నోటీసులు ఇస్తే.. అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు.
నాంపల్లి లోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఇది అధికార మదం, అహంకారం అన్నారు. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించిందన్నారు. కవిత విషయంలో, అదానీ విషయంలో టీజేఎస్ ఒకే విధానంతో ఉందన్నారు. రేపు మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు కోదండరాం. ఈ సదస్సుకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు తరలిరావాలని పిలుపునిచ్చారు.