మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ షూట్లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఖుషి సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రబృందం సామ్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. సెట్లో ఉమెన్స్ డేను సెలబ్రేట్ చేసి సమంతకు సర్ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు శివ నిర్వాణ. ఆ తర్వాత మూవీ టీమ్ అంతా కలిసి సామ్ చేత కేక్ కట్ చేయించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను ‘ఖుషి’ డైరెక్టర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయిందంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లే ఛాన్స్ లేదంటూ నెట్టింట గుసగుసలు కూడా మొదలయ్యాయి. అయితే వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టిన మూవీ టీమ్ సమంతకు ఇలా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
ఇక ఇటీవల తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ షూటింగ్లో పాల్గొన్న సమంతపై భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తోంది ఆ చిత్ర టీమ్. దీంతో చిత్రీకరణలో ఆమె చేతికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ షూట్‌తో పాటు తన మరో ప్రాజెక్ట్ అయిన ‘ఖుషి’ సెట్స్‌లోకి సామ్ అడుగుపెట్టింది.