భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ తన ఖాతాలో చాలా రికార్డులని వెనకేసుకున్నాడు. ప్రస్తుతం మరో అరుదైన రికార్డుని తన బ్యాగులో వేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సాధించిన రికార్డుకి కేవలం 136పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ, ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే మ్యాచుల్లో బద్దలు కొట్టనున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా ఉన్న రికార్డు సచిన్ పేరిట ఉంది.
300మ్యాచుల్లో సచిన్ ఈ రికార్డుని అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 239మ్యాచులాడి 11,867పరుగులు చేసాడు. మరో 133పరుగులు చేస్తే సచిన్ సాధించిన రికార్డుని తిరగరాసిన వాడవుతాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల్లో ఈ రికార్డుని క్రియేట్ చేయడం చాలా సులభమే. నవంబర్ 27వ తేదీన మొదటి వన్డే జరగనుంది. ఆ తర్వాత ముడు టీ ట్వంటీలతో పాటు నాలుగు టెస్టులు కూడా ఆడనుంది. కానీ నాలుగు టెస్టుల్లో కేవలం ఒక టెస్టుకి మాత్రమే కోహ్లీ హాజరవుతున్నాడు.