తోటి సీనియర్స్ నాగార్జున, బాలకృష్ణ.. వెంకటేశ్ సెట్స్‌పైకి వచ్చేశారు. మరి చిరంజీవి ఎప్పుడొస్తాడా? ఆచార్యను ఎప్పుడు మొదలు పెడతాడా? సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా? అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఆరోజు వచ్చేస్తోంది. డైరెక్ట్ ఆచార్యగా కనిపించకుండా.. ట్రైల్ షూట్‌లో సమంతతో కలసి పాల్గొన్నాడు చిరంజీవి.
ఆచార్య షూటింగ్‌ను ఈనెల 9న మొదలుపెట్టడానికి రెడీ కాగా.. చిరంజీవికి పాజిటివ్ అని తేలడంతో… ఆయన లేకుండానే షూటింగ్ షార్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఒక్కటీ లేకపోవడంతో.. మూడుసార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు చిరంజీవి. నెగిటివ్ రావడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. నెలాఖరులో ఆచార్య షూట్‌లో జాయిన్ అవుతున్న చిరంజీవి.. ఈలోగా ఆహాలో ప్రసారమవుతున్న ‘సామ్‌జామ్’ షోలో పాల్గొన్నాడు. 7 నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన చిరంజీవికి ఈ ఓటీటీ అనుభవం కరోనా ట్రైంలో ట్రైల్‌పార్ట్‌గా ఉపయోగపడింది ఆచార్య సెట్లో ఎలా వుండాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సామ్‌జామ్ నేర్పింది.
యంగ్ హీరో విజయ్‌దేవరకొండతో సామ్‌జామ్ షో మొదలైంది. నవ్వుతూ.. నవ్విస్తూ.. అమాయకంగా.. చిరంజీవి నుంచి కూడా ఎన్నో విషయాలు లాగనుంది సమంత. 40 ఏళ్ల యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ చిరంజీవి ఇంతవరకు ఎక్కడా పంచుకోని ఏయే అనుభవాలను సామ్ జామ్ షోలో తెలుపుతాడో చూడాలి.