ప్ర‌మాదంలో కోహ్లీ టెస్టు ర్యాంకు.. స‌రిచేసుకోక‌పోతే అంతే

-

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ప‌ట్టు గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. క్రికెట్‌లో ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు తిరుగే లేదు. ఆయ‌నొక్క‌రే మూడు ఫార్మాట్లలో ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న ఏకైక క్రికెట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ వన్డేల్లో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే టీ20, టెస్టు కేట‌గిరీలో ఐదో ర్యాంకులో ఉన్నాడు ఈ క్రికెట్ కింగ్‌. కాగా ఇప్పుడు ఆయ‌న టెస్టు ర్యాంకు ప్రమాదంలో పడింద‌ని తెలుస్తోంది.

ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని పాయింట్లు కోల్పోయి ప్ర‌మాద ప‌రిస్థితుల్లో త‌న ర్యాంకును తెచ్చుకున్నాడు. మొన్న జ‌రిగిన వరుస టెస్ట్ మ్యాచుల్లో ఆయ‌న విఫలమైనా కూడా అంత‌కు ముందు ఉన్న ఆవ‌వ‌రేజ్ కార‌ణంగా ఐదో ర్యాంకును తెచ్చుకున్నాడు. అయితే హిట్ మ్యాన్ రోహిత్ కంటే విరాట్ కేవలం మూడు రేటింగ్ పాయింట్లతో ముందు ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇప్పుడు గ‌న‌క కోహ్లీ మళ్లీ విఫలమైతే వేరేలా ఉంటుంది.

విరాట్ గ‌న‌క ఫెయిల్ అయినే కెప్టెన్‌ను హిట్ మ్యాన్ అధిగమిస్తాడని తెలుస్తోంది. ఇక మొన్న జ‌రిగిన టెస్టు మ్యాచ్ తో క‌లిసి స్టార్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ ర్యాంకు మెరుగుపరుచుకోకపోయినా కూడా ఎక్కువ కాలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఉండ‌టంతో పాటు 773 రేటింగ్ పాయింట్స్ తో మంచి పొజీష‌న్ లో ఉన్నాడు. ఇక మొన్న ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్‌లో కూడా హాఫ్ సెంచరీ చేయ‌డం ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. ఇంకోసారి గ‌న‌క రోహిత్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే ఈజీగా కోహ్లీని అధిగ‌మిస్తాడ‌నే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version