IPL 2021 : ఢిల్లీ కి షాక్ : మూడు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ఘనవిజయం

-

ఇవాళ సార్జా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో, ఢిల్లీ కాపీటల్స్ జట్టు తల పడుతున్న సంగతి తెలిసిందే. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు…20 ఓవర్లలో ఏకంగా 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేసింది. అయితే 128 పరుగుల లక్ష్య ఛేదన ను కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు చాలా కష్టపడి చేరుకుంది. 18.2 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది నైట్ రైడర్స్ జట్టు.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నైట్ రైడర్స్ జట్టు. నైట్రైడర్స్ బ్యాట్స్ మెన్ ల లో శుభమన్ గిల్ 30 పరుగులు, నితీష్ రానా 36 పరుగులు నాటౌట్, మరియు సునీల్ నరైన్ 21 పరుగులు చేసి… నైట్రైడర్స్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

అటు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కూడా చాలా దీటుగా బౌలింగ్ వేశారు. ఆవిష్ ఖాన్ మూడు వికెట్లు తీసి నైట్ రైడర్స్ జట్టును… ఒత్తిడిలో కి నెట్టాడు. అయినప్పటికీ నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ నితీశ్ రానా 36 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో నైట్ రైడర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version