హుజూరాబాద్ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదురుకావడంతో కాంగ్రెస్ తన పనితీరును సమీక్షించుకోనుంది. కనీసం డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిపోవడం ఆపార్టీలో తీవ్ర దుమారాన్ని రేపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 3000 వేల ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో ఎన్నికల తర్వాతి రోజైన బుధవారం కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హుజూరాబాద్ ఎన్నికల్లో పరాజయం గురించి కాంగ్రెస్ లీడర్లు చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాలను ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి, శ్రధర్ బాబు, బట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, దామోదర్ రాజనర్సింహ, షబ్బీర్ అలీ, అజారుద్దీన్, జీవన్ రెడ్డి మొదలైన వారు హజరయ్యారు.
కాగా ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్లు సమావేశానికి హాజరుకాలేదు. నిన్న జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మరోమారు విభేదాలు హుజూరాబాద్ ఎన్నికల సాక్షిగా బయటపడ్డాయి