రేవంత రెడ్డి క్షమాపణలపై వెనక్కి తగ్గని కోమటిరెడ్డి

-

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలకు తాను దిగిరానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు దారుణమని… అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే.. మునుగోడులో ప్రచారం చేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తనకు క్షమాపణలు అవసరం లేదని అతన్ని సస్పెండ్ చేయాలని కోరారు.

ఇది ఇలా వుండగా కొన్ని గంటలకి ముందు  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలు, హోంగార్డు ప్రస్తావనపై క్షమాపణ, సభలో అద్దంకి వ్యాఖ్యలు సరికాదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version