రాజగోపాల్ రూట్ క్లియర్‌గా లేదా?

-

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ ఎటు వెళుతుందనే అంశం అసలు క్లారిటీ రావడం లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉండటం ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ పీసీసీ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్‌కు కాస్త దూరం జరిగారు. కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తలాగా పనిచేస్తానని చెబుతూనే, కేంద్రంలో ఉండే బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నారు. అదేం అంటే తన పార్లమెంట్ అభివృద్ధి కోసమని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి

సరే వెంకటరెడ్డి గురించి పక్కనబెడితే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రూట్ ఏంటో అసలు అర్ధం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదివరకే ఈయన బీజేపీలోకి వెళుతున్నాని కూడా ప్రకటించేశారు. అలా అని బీజేపీలోకి వెళ్ళారా అంటే లేదు. పోనీ కాంగ్రెస్ తరుపున పనిచేస్తున్నారా అంటే అది తెలియడం లేదు. కానీ తన అనుచరులతో నియోజకవర్గంలో మాత్రం తిరుగుతున్నారు.

తాజాగా కూడా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న దళితబంధుపై స్పందిస్తూ, హుజూరాబాద్‌కే రూ.2 వేల కోట్లు కేటాయిస్తుంటే, మునుగోడు కోసం తాను రాజీనామా చేస్తానని అంటున్నారు. అంటే 2 వేల కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని చెబుతున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారు.

కానీ ఈయన కాంగ్రెస్ లైన్‌లో మాట్లాడుతున్నారో, బీజేపీ లైన్‌లో మాట్లాడుతున్నారో కూడా కార్యకర్తలకు అర్ధం కావడం లేదు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే రాజగోపాల్ కాంగ్రెస్‌లో ఉంటారో లేక, బీజేపీ వైపుకు వెళ్తారో అనే అంశం క్లారిటీ రావడం లేదు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సెపరేటుగా ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version