కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. బీజేపీ వర్సెస్ వైసీపీ

-

కడప: ప్రొద్దులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ సిద్ధమయ్యారు. అంతేకాదు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ కూడా చేశారు. దీంతో ప్రొద్దులూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ప్రొద్డుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపు నిచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిప్పు విగ్రహాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ధర్నా ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.

మరోవైపు ప్రజాభిప్రాయం మేరకు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రాచమల్లు అంటున్నారు. బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రొద్దుటూరు వైసీపీ నేతలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version