మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో నేడు కొత్తగా ఆరు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అంతేకాకుండా నియోజకవర్గానికి భారీగా నిధులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన ఆరు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే.. అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపారు.
నల్గొండ జిల్లా మునుగోడుకు ఆరు బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇదిలాఉండగా, తనను కేబినెట్‌లోకి తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు కథనాలు వస్తున్నాయి.
మునుగోడుకు భారీ నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే
ఆరు కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించి స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా మునుగోడుకు ఆరు బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక… pic.twitter.com/34uKFpFWLM
— Telugu Scribe (@TeluguScribe) December 15, 2024