పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మార్పు..రేవంత్‌ పై చంద్రబాబు రియాక్ట్‌ !

-

హైద్రాబాద్ లో ఉన్న పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మార్పు చేసిన నేపథ్యంలో..రేవంత్‌ పై చంద్రబాబు రియాక్ట్‌ అయ్యారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. హైద్రాబాద్ లో ఉన్న పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరు మార్చే పరిస్థితి వచ్చింది…త్వరలోనే ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత ఉద్యమం వచ్చిందని… తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు.

Potti Sriramulu University’s name change Chandrababu’s reaction to Revanth

పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఆయన ఉన్న ఇంటిని మెమోరియల్ గా మారుస్తామని కీలక ప్రకటన చేశారు. 25 ఏళ్ల ముందే నేను ఐటీ ప్రారంభించానన్నారు. రైస్ మిల్ లో ధాన్యం దించగానే రైతులకి డబ్బులు పడేలా మార్పులు తెస్తామని ప్రకటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ త్వరలో తీసుకు వస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సుపరిపాలన అందించేమే ఎన్డీయే కూటమి లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ త్వరలో తీసుకు వస్తున్నామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version